Save the tiger2: ‘సేవ్ ది టైగర్స్‌2’ రికార్డు.. ఇండియాలోనే టాప్‌..

 కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌2  రికార్డు సృష్టించింది. 

Published : 04 Apr 2024 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save the tigers). ఇది ఓటీటీలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’ పేరుతో వచ్చిన ఆ సిరీస్‌కు విశేష స్పందన లభిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమవుతోన్న ఇది తాజాగా రికార్డు సృష్టించింది. ఈ తెలుగు వెబ్‌ సిరీస్ దేశంలోని టాప్‌ 3లో నిలిచింది. ఓటీటీలోనే దేశవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సిరీస్‌ల్లో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

దీనిపై దర్శకుడు మహి వి.రాఘవ్‌ స్పందిస్తూ అరుదైన ఘనత సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రెండు సీజన్లు ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదని.. మంచి కంటెంట్‌కు ఆదరణ లభిస్తుందని మరోసారి రుజువైందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం ఫుల్‌ జోష్‌తో మూడో సీజన్‌ పనులను ప్రారంభించింది యూనిట్‌. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జూన్‌లో దీని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులోనూ జోర్దార్‌ సుజాత, గంగవ్వ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని