Sayaji Shinde: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే

ప్రముఖ నటుడు సాయాజీ షిండే (Sayaji Shinde) ఆస్పత్రిలో చేరారు.

Updated : 12 Apr 2024 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ నటుడు సాయాజీ షిండే (Sayaji Shinde) ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

‘‘సాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. రొటీన్‌ చెకప్‌లో భాగంగా మమ్మల్ని సంప్రదించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించాం. దీంతో యాంజియోగ్రఫీ చేయించమని సూచించాం. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపిస్తాం’’ అని తాజాగా వైద్యులు తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఠాగూర్‌’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలు పోషించారు. ‘గుడుంబా శంకర్‌’, ‘సూపర్‌’, ‘అతడు’, ‘రాఖీ’, ‘పోకిరి’, ‘దుబాయ్‌ శీను’, ‘నేనింతే’, ‘కింగ్‌’, ‘అదుర్స్‌’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని