Skanda: గండరబాయ్‌ గాలివాన

‘గంట కొట్టి సెప్పుకో...గంటలోనే వస్తానే గండర గండరబాయ్‌..గజ్జ కట్టి సెప్పుకో... గాజులెట్టి సెప్పుకో...గాలి వాన తెస్తానే గండర గండరబాయ్‌...’ అంటూ సందడి షురూ చేశారు రామ్‌. 

Updated : 19 Aug 2023 14:07 IST

‘గంట కొట్టి సెప్పుకో...గంటలోనే వస్తానే గండర గండరబాయ్‌..గజ్జ కట్టి సెప్పుకో... గాజులెట్టి సెప్పుకో...గాలి వాన తెస్తానే గండర గండరబాయ్‌...’ అంటూ సందడి షురూ చేశారు రామ్‌.  ఇదంతా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘స్కంద’ సినిమా కోసమే. శ్రీలీల కథానాయిక. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘గండరబాయ్‌’ పాటని శుక్రవారం విడుదల చేశారు. తమన్‌ స్వరకల్పనలోని ఈ పాటని అనంత శ్రీరామ్‌ రచించగా, నకాష్‌ అజీజ్‌, సౌజన్య భాగవతుల ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు సమకూర్చారు. ‘‘మాస్‌ని అలరించేలా సిద్ధం చేసిన జానపద గీతమిది. రామ్‌ డైనమిజం, శ్రీలీల ఉత్సాహం ప్రధాన ఆకర్షణ. ఆ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్‌ చూడటానికి రెండు కళ్లు చాలవనే స్థాయిలో ఉంటుంది. ఘన విజయం సాధించిన ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. అత్యున్నత నిర్మాణ విలువలతో శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సౌత్‌తో కలిసి పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని