Sekhar Kammula: ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్‌ కమ్ముల

గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్‌’ రీ రిలీజ్‌ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల మీడియాతో మాట్లాడారు.

Published : 19 Apr 2024 00:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథలను తెరకెక్కించడంలో ముందుండే దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula). ఆయన రూపొందించిన హిట్‌ సినిమాల్లో ‘హ్యాపీడేస్‌’ (Happy Days) ఒకటి. 2007 అక్టోబరులో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శేఖర్‌ మీడియాతో ముచ్చటించారు. ‘హ్యాపీడేస్‌’, ‘లీడర్‌’ (Leader) సీక్వెల్స్‌పై స్పందించారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘కుబేర’ (Kubera) కబుర్లు చెప్పారు.

‘‘ఎన్నిసార్లు చూసినా ‘హ్యాపీడేస్‌’ బోర్‌ కొట్టదు. ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. దానికి సీక్వెల్‌ చేయాలని నాకూ అనిపించింది. కానీ, కథ కుదర్లేదు. ‘లీడర్‌’కు కొనసాగింపు చిత్రం తెరకెక్కించాలనే ఆలోచన ఉంది. ఒకవేళ చేస్తే మళ్లీ రానాతోనే చేస్తా. సమయం పడుతుంది. ఆ సినిమాలో రూ. లక్ష కోట్ల అవినీతి గురించి చర్చిస్తే కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. సీక్వెల్‌ను రానాతోనే చేయాలి. కొత్తవారితో ప్రయత్నిస్తే దెబ్బతింటాం’’ అని పేర్కొన్నారు.

‘‘ధనుష్‌, నాగార్జునతో తెరకెక్కిస్తున్న ‘కుబేర’ పెద్ద సినిమా. నేను రాసుకున్న కథ, అందులోని పాత్రలకు వీరు సెట్‌ అవుతారనే ఎంపిక చేశా. కాపీ కథలను నేను తెరకెక్కించను. ఓ కథాలోచన రావడం, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. నేను కథ సిద్ధంగా చేసుకోవడంలో నెమ్మదిగా వ్యవహరించినా. మేకింగ్‌ పరంగా మాత్రం ఫాస్ట్‌గా ఉంటా’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని