Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
జమున (Jamuna) పేరు చెప్పగానే తెలుగువారికి గుర్తుకు వచ్చే చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ (Gundamma Katha) ఒకటి. ఆ సినిమాకు 60 ఏళ్లు అయిన సందర్భంగా గతంలో ఆ చిత్రం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె కన్నుమూసిన సందర్భంగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: అలనాటి నటి జమున (Jamuna) ఇక లేరు. హైదరాబాద్‌లో ఆమె కన్నుమూశారు. ఆమె పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే సినిమాల్లో ‘గుండమ్మ కథ’ (Gundamma Katha) ఒకటి. అంతలా ఆమెకు పేరు సంపాదించి పెట్టిందీ సినిమా. ఈ సినిమా పేరు వినగానే వినసొంపైన మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు గుర్తుకొస్తాయి. రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు.. సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై అరవై ఏళ్లు అయిన సందర్భంగా గతంలో జమున ఈటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడా విషయాలు మీ కోసం...
‘గుండమ్మ కథ’ టైటిల్ చూడగానే అప్పట్లో స్పందన ఎలా ఉంది..?
జమున: ‘గుండమ్మ కథ’ సినిమా పేరు పెట్టినప్పుడు పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR)తో అప్పటికే నాకున్న వివాదాన్ని ‘గుండమ్మ’ సినిమా కాంప్రమైజ్ చేసింది. ఆ హీరోలతో దాదాపుగా మూడేళ్లు నేను మాట్లాడలేదు. వేరే వాళ్లయితే మునిగిపోతారు. నేను కాబట్టి వగరు, పొగరుతో మూడేళ్లు వాళ్లతో సినిమాలు చేయనని భీష్మించుకున్నాను. ఈ క్రమంలో జగ్గయ్య లాంటి వాళ్లతో సినిమాలు చేసి సూపర్‌హిట్ ఇచ్చా. పాత రోజుల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కాంచనమాల, కన్నాంబ.. తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం తర్వాత మేం వచ్చాం. ఒక్కొక్కరం 20, 30 ఏళ్లు నటించాం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సంబంధాలు సరిగ్గా లేనప్పుడు ‘గుండమ్మ కథ’లోకి ఎలా వచ్చారు? సరోజగా మీరే చేయాలని ఎందుకు కోరారు?
జమున: ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. నాగేశ్వరరావుతో ఇబ్బంది వచ్చి ఆయనతో సినిమాలు చేయలేదు. ఏ రంగంలోనైనా ఆత్మాభిమానం పొగొట్టుకోకూడదు అనుకుంటే స్త్రీ తప్పక సమస్యల్ని ఎదుర్కొవాలి. సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. ‘నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండి’ అని నాగేశ్వరరావుతో చెప్పారు. అందులో నేను చిలిపి అమ్మాయిగా చేసి ప్రేక్షకులను అలరించాను.
మీ నలుగురినే ‘గుండమ్మకథ’లో పెట్టుకోవాలని అనుకోవడంలో ‘మిస్సమ్మ’ సినిమా పాత్ర ఏమైనా ఉందా?
జమున: ఏ పాత్ర సృష్టించినా దాని స్వభావం, తీరు తెన్నులను రచయిత గమనిస్తారు. ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తారు. సావిత్రి (Savitri) పొగరుగా నటిస్తే అంగీకరిస్తారా.. ఆమె పాత్రలు సాఫ్ట్‌గా ఉండాలి. జమున ఏడుపుగొట్టు పాత్రలు వేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? జమున సత్యభామలా ఉండాలనుకుంటారు. అలాంటి నటన జన్మతహః ఉండాలి. అప్పుడే పాత్రలో ఒదిగిపోతాం.
టీనేజ్‌లో కూడా అమ్మా కాఫీ అనేవారా?
జమున: అదేం లేదు. రాణిలాగా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మా, నాన్న, తమ్ముడు, మరదలు మా ఇంట్లోనే ఉండేవారు. అంతా అమ్మా చూసుకునేది. ఆమెకు క్రమశిక్షణ ఎక్కువ. నా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవారు.
సూర్యకాంతంతో మీ అనుబంధం ఎలా ఉండేది?
జమున: సూర్యకాంతం (Suryakantham) నాకు చాలా క్లోజ్. మంచి తల్లి అందరినీ బిడ్డల్లా చూసేది. సెట్లో అందరికీ భోజనం పెట్టేందుకు పెద్ద క్యారేజీ తెప్పించేది. దగ్గరుండి తినిపించేది.
జమున పంచుకున్న మరిన్ని విశేషాలను ఈ పూర్తి వీడియోలో చూడండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్‌తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్‌తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్‌గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్‌తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్‌కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్‌పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్‌లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?