‘షాదీ ముబారక్‌’నుంచి పూర్తి వీడియో సాంగ్‌!

బుల్లితెర మెగాస్టార్‌గా పేరొందిన నటుడు సాగర్‌ (ఆర్కేనాయుడు) ప్రధాన పాత్రలో ‘షాదీముబారక్‌’చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దృశ్య రఘునాద్‌ హీరోయిన్‌ కాగా దర్శకుడు పద్శశ్రీ తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు దక్కాయి.

Updated : 27 Dec 2022 17:29 IST

హైదరాబాద్‌: బుల్లితెర నటుడు సాగర్‌ (ఆర్కేనాయుడు) ప్రధాన పాత్రలో ‘షాదీముబారక్‌’చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దృశ్య రఘునాథ్‌‌ హీరోయిన్‌ కాగా దర్శకుడు పద్శశ్రీ తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. అయితే ఒక చిన్న పాయింట్ కథగా మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేయడం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిన్న జంటగా..’అంటూ సాగుతున్న ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

సింగర్‌ కపుల్స్‌ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఆలపించగా శక్తికాంత్‌ స్వరపరిచారు. వనమాలి సాహిత్యం అందించారు. మరి లేటెందుకు ఆ సాంగ్‌ను మీరు చూసి ఆనందించండి !

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని