Shah Rukh- Salman: షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఇంట అభిమాన సంద్రం.. వీడియోలు వైరల్‌

రంజాన్‌ వేళ బాలీవుడ్‌ హీరోలు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ఇంట అభిమానులు బారులు తీరారు. తమ అభిమాన నటులను చూసి ఆనందించారు.

Published : 12 Apr 2024 00:12 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఇంటి పరిసరాల్లో సందడి నెలకొంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. సంబంధిత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏటా రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని షారుక్‌ తన ఇంటి (మన్నత్‌) బాల్కనీ నుంచి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు. ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ విషెస్‌ చెప్పారు. ఆ దృశ్యాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ‘‘అందరికీ ఈద్‌ శుభాకాంక్షలు. ఈ రోజును ప్రత్యేకంగా నిలిపినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

మరో స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఇంటి ముందు అభిమానులు బారులు తీరారు. చీకటికావడంతో సెల్‌ఫోన్‌ లైట్స్‌ వెలుగుల్లో తమ ఫేవరెట్‌ హీరో కోసం వేచి చూశారు. సల్మాన్‌ అభివాదంతో వారంతా ఖుషీ అయ్యారు. నెటిజన్లతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ హీరోల పోస్ట్‌పై స్పందించారు. లవ్‌ సింబల్‌ ఎమోజీలతో తమ ప్రేమను చాటుకున్నారు. రంజాన్‌ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని