shah rukh khan: మళ్లీ ఎప్పుడూ విరామం తీసుకోను

చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తన సినిమాలతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌.

Updated : 31 Jan 2024 09:37 IST

చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తన సినిమాలతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌. ‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’.. గతేడాది విడుదలైన ఈ సినిమాలతో సినీప్రియులను విశేషంగా ఆకట్టుకొని.. బాక్సాఫీసును షేక్‌ చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో తను సినిమాల నుంచి విరామం తీసుకోవడం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు షారుక్‌. ‘‘చిత్ర పరిశ్రమలో 33ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాను. కానీ.. ఈ మధ్యలో నేను చాలా రోజులు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాను. నేను తెరపై కనిపిస్తానో లేదోనని అభిమానులు భయపడ్డారు. వరసగా నేను నటించిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో నేను మంచి కథలను ఎంచుకోవడం లేదేమో అని అనుకున్నాను. అందుకే ఈ ఏడాది ‘పఠాన్‌’, ‘జవాన్‌’ లాంటి చిత్రాలతో మీ ముందుకు వచ్చాను. ఇకపై ఎప్పుడూ నేను విరామం తీసుకోను. ఇంకోసారి అలా జరగదు. నా సినిమాల కన్నా ఎక్కువగా.. నాపై ప్రేమ చూపుతూ నన్ను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు