షారుక్‌, నేను క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాదు.. మా దారులు వేరు: మనోజ్‌

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) షారుక్‌ ఖాన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 06 Jan 2024 14:10 IST

ముంబయి: ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) దిల్లీలోని యాక్టింగ్‌ గ్రూపులో పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సినీ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా అతడితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మనోజ్‌.

‘‘మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాదు. దిల్లీలో ఒకే గ్రూప్‌లో పని చేయడంతో మాకు పరిచయం ఏర్పడింది. అతడి స్నేహితులు వేరు.. నా స్నేహితులు వేరు. మేము వేర్వేరు దారులు ఎంచుకున్నాం. మా దారులు ఎప్పటికీ కలవవు’’ అని మనోజ్‌ చెప్పారు. గతేడాది తాను నటించిన ‘జోరామ్’ను ఉద్దేశించి.. ‘‘చాలా మంది ఆ చిత్రాన్ని చూడలేదు. ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తారో లేదో చూడాలనుకున్నాం. అందుకు అనుగుణంగానే ‘జోరామ్‌’ను అతి తక్కువ థియేటర్లలో విడుదల చేశాం. చూసిన వాళ్లకు ఈ సినిమా నచ్చింది. కొందరు ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదని అనడం నన్ను బాధించింది’’ అని మనోజ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని