shah rukh khan: ఇరవై రెండేళ్ల తర్వాత..

ఇరవై రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ ఖాన్‌, కళాత్మాక చిత్రాల దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఓ చిత్రం పట్టాలెక్కనుంది.

Updated : 19 Jan 2024 09:38 IST

ఇరవై రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ ఖాన్‌, కళాత్మాక చిత్రాల దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఓ చిత్రం పట్టాలెక్కనుంది. అదే భన్సాలీ తన కలల ప్రాజెక్టుగా చెబుతున్న ‘ఇన్షా అల్లా’. ఈ రొమాంటిక్‌ కామెడీలో సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్నారని గతంలో వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆయన స్థానంలో షారుక్‌ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ‘కొద్దినెలలుగా షారుక్‌, భన్సాలీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కథాపరంగా షారుక్‌ అయితేనే ఈ పాత్రకు సరిపోతారని భన్సాలీ నచ్చజెప్పడంతో షారుక్‌ ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది’ అంటూ గురువారం ఓ మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. వయసు మళ్లిన హీరో, అతడి కన్నా వయసులో బాగా చిన్నదైన కథానాయిక మధ్య మొదలైన ప్రేమ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని