Shah Rukh Khan: ఈ అవార్డు వారికే అంకితం: షారుక్‌ఖాన్‌

బాలీవుడ్ అగ్రహీరో షారుక్‌ఖాన్‌ ఉత్తమ నటుడిగా అందుకున్న అవార్డును సహనటులకు అంకితమిస్తూ మాట్లాడారు.

Updated : 21 Feb 2024 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్ఎఫ్‌)- 2024’ (Dadasaheb Phalke International Film Festival). మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన వేడుకల్లో ‘జవాన్‌’(Jawan) చిత్రానికి షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan)ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అవార్డును సహ నటులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ అవార్డు అంటే ఎంతో ఇష్టం. కొన్నేళ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నా. ఈ విజయం సాధించినందుకు విధు వినోద్‌ చోప్రా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంతోష సమయాన్ని మేమిద్దరం షేర్‌ చేసుకుంటాం. అవార్డు అందుకుంటానని ఊహించలేదు. చాలా థ్రిల్‌ అయ్యాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు జవాన్‌ చిత్రబృందానికి కృతజ్ఞతలు. నటుడికి ప్రేక్షకుల ఆదరణ ఎంతో అవసరం. మీకు మాటిస్తున్నా. మంచి సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉంటాను. డ్యాన్స్‌, యాక్షన్‌, రొమాటింక్‌ జోనర్‌ ఏదైనా అందరి ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తాను’’ అని షారుక్‌ వెల్లడించారు.

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’ చిత్రం బాక్సీఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా నటించిన నయనతార ఉత్తమ నటిగా నిలిచారు. ‘యానిమల్‌’ సినిమా దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని