Shah Rukh Khan: ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా : షారుక్‌ ఖాన్‌

తన అభిమానులకు షారుక్ (Shah Rukh Khan) ధన్యవాదాలు చెప్పారు. కష్టసమయంలోనూ అండగా ఉన్నారని పేర్కొన్నారు.

Published : 11 Jan 2024 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది మూడు సూపర్ హిట్‌ చిత్రాలను ఖాతాలో వేసుకుని షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) బాద్‌షా అని మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ఆయన ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు.

‘నా సినిమాలను చూస్తూ నాపై ప్రేమాభిమానాలు చూపుతోన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గతేడాది మీరు అందించిన మద్దతు నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. దానికి ముందు ఐదేళ్లు నేను, నా కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ‘పఠాన్‌’కు ముందు నేను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొందరు విశ్లేషకులు నాపై, నా కెరీర్‌పై ఇష్టమొచ్చినట్లు రాశారు. వాటిని చూసి ఎంతో బాధపడ్డాను. అదే సమయంలో నా కుమారుడిపై మాదక ద్రవ్యాల కేసు వివాదం నన్ను కుదిపేసింది. ఎంతో ఇబ్బంది కలిగించే అసహ్యకరమైన కామెంట్లు చేశారు. వీటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. మౌనంగా ఉండడమే అన్నిటికీ సమాధానం. అంతా మంచే జరుగుతుందనుకున్నా. ఇంకా కష్టపడాలని నిర్ణయించుకున్నా. ‘పఠాన్‌’తో నేను ఊపిరిపోసుకున్నా. కష్టాలు వచ్చాయంటే జీవితం ముగిసిందని అనుకోకండి. ఆశతో జీవించండి’ అని చెప్పారు.

గతేడాది షారుక్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్‌’, ‘డంకీ’ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. వీటిలో రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం షారుక్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని