Dunki: నాకోసం ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా.. ఎందుకంటే: షారుక్‌ ఖాన్‌

షారుక్‌ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘డంకీ’. ఇది తనకెంతో ప్రత్యేకమని ఆయన అన్నారు.

Published : 18 Dec 2023 14:15 IST

ముంబయి: ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్‌లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు షారుక్‌ ఖాన్‌. త్వరలోనే ‘డంకీ’తో (Dunki) అలరించడానికి సిద్ధమయ్యారు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో షారుక్‌ ప్రచారం జోరుపెంచారు. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘డంకీ’ తనకెంతో ప్రత్యేకమని చెప్పారు.

‘‘పఠాన్‌’, ‘జవాన్‌’లలో నటించిన తర్వాత నాకోసం నేను సినిమా చేయలేదని అర్థమైంది. అందుకే ‘డంకీ’ చేశాను. ఇది నా సినిమా. నా మనసుకు ఎంతో దగ్గరైంది. ‘పఠాన్‌’ మహిళల కోసం చేశాను. నాకోసం చేసిన సినిమాతో ఈ ఏడాదిని ముగించాలనుకున్నా. రాజ్‌ కుమార్‌ హిరాణీ దేశంలోనే గొప్ప దర్శకుల్లో ఒకరు. ఇప్పటి వరకు ఆయన ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించలేదు. ‘డంకీ’ చూశాక ఆయన గొప్ప ప్రేమకథను తెరకెక్కించారని అందరికీ అర్థమవుతుంది. ఇందులో విక్కీ కౌశల్‌ అద్భుతంగా నటించారు. తను నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఆ సినిమాలో తనతో చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నా’’ అని షారుక్‌ (Shah Rukh Khan) చెప్పారు.

‘గుంటూరు కారం’ పాటపై ప్రచారం.. నిర్మాత క్లారిటీ..

ఇక రాజ్‌కుమార్‌ హిరాణీ- షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘డంకీ’. భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. ఇప్పటికే అభిమానుల్లో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని