Shah Rukh Khan: తర్వాత సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చిన షారుక్‌..

బాక్సాఫీస్‌ వద్ద తన హవా కొనసాగిస్తున్నారు హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). ‘డంకీ’ తర్వాత ఆయన చేయనున్న సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చారు.

Updated : 22 Dec 2023 21:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది వరుస విజయాలు అందుకుని జోష్‌ మీదున్నారు షారుక్‌ ఖాన్‌. ‘డంకీ’ (Dunki) తర్వాత ఆయన చేయనున్న సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే చర్చ మొదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్‌ తన తర్వాత ప్రాజెక్ట్‌ గురించి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో కొత్త సినిమా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ‘ఈసారి కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నా. నా వయసుకు తగిన పాత్ర చేయనున్నా. అది అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. అయితే, ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే విషయాన్ని చెప్పలేదు.

ఇక ఇటీవల అట్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షారుక్‌-విజయ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు. షారుక్‌ ఖాన్ చెప్పిన ప్రాజెక్ట్‌ ఇదా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆయన మరికొందరు దక్షిణాది దర్శకుల నుంచి కూడా కథలు వింటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతోపాటు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ సినిమాను ప్రకటించారు. ఇది 2025లో ప్రారంభించనున్నారు. దీనికంటే ముందే షారుక్‌ (Shah Rukh Khan)ఓ సినిమా చేసే అవకాశం ఉంది.

ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌.. ‘2018’కి దక్కని చోటు

షారుక్‌ నటించిన తాజా చిత్రం ‘డంకీ’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు రూ.30కోట్లు వసూళ్లను సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీకెండ్‌లో కలెక్షన్లు  మరింత పెరిగే అవకాశముందంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని