Farzi: విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌ల తొలి వెబ్‌సిరీస్.. ఆరోజే విడుదల
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), షాహిద్ కపూర్(Shahid Kapoor) నటించిన ‘ఫర్జీ’(Farzi) స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్: ది ఫ్యామిలీమ్యాన్(The Family Man) సిరీస్‌తో సూపర్‌హిట్ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టించారు దర్శకులు రాజ్-డీకే. ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో ‘ఫర్జీ’(Farzi) వెబ్ సిరీస్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్(Prime Video) వేదికగా అలరించేందుకు సిద్ధమైంది.
ఫిబ్రవరి 10వ తేదీన ఈ వెబ్ సిరీస్ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు పోస్టర్‌లను విడుదల చేశారు. వాటిల్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ వాళ్లకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇది ఒకటని. ఎంతో అభిరుచితో రూపొందించారని తెలిపారు. ది ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని అన్నారు. కేకే మేనన్, రాశీ ఖన్నా(Raashi Khanna), రెజీనా (Regina Cassandra) తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్లలో ప్రసారం కానుంది. ధనికులకు అనుకూలంగా ఉండే వ్యవస్థను ఓ ఆరిస్టు తెలివిగా ఎలా కనిపెడతాడు అనే కాన్సెప్ట్‌తో ఇది సాగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!