Shahrukh khan: విశాల్‌ దర్శకత్వంలో షారుక్‌?

గతేడాది జనవరి నుంచి డిసెంబరు వరకు తన సినిమాలతో బాలీవుడ్‌ చిత్రసీమని ఓ స్థాయికి తీసుకెళ్లారు అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌.

Updated : 10 Jan 2024 10:51 IST

తేడాది జనవరి నుంచి డిసెంబరు వరకు తన సినిమాలతో బాలీవుడ్‌ చిత్రసీమని ఓ స్థాయికి తీసుకెళ్లారు అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌. ‘పఠాన్‌’, ‘జవాన్‌’లతో బాక్సాఫీసు కలెక్షన్లతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన తన తదుపరి చిత్రం ప్రముఖ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. ‘షారుక్‌ తన తదుపరి సినిమా కోసం విశాల్‌తో చర్చలు జరుపుతున్నారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు వారిద్దరూ సిద్ధమవుతున్నారు. విశాల్‌ థ్రిల్లర్‌ కథనాలతో అభిమానులను అలరిస్తుంటారు. ఆయన సినీ ప్రపంచం...షారుక్‌ ఇమేజ్‌ భిన్నంగా ఉంటాయి. కానీ వీరిద్దరూ కలిసి కొత్తదనం నిండిన థ్రిల్లర్‌ చిత్రంతో సినీ ప్రియుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు’ అని తెలిపాయి సన్నిహిత వర్గాలు. యాక్షన్‌ సినిమాల తర్వాత షారుక్‌ ఎలాంటి థ్రిల్లర్‌ కథనంలో రానున్నారో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని