Shankar: అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో శంకర్‌ కుమార్తె నిశ్చితార్థం..

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్‌ సందడిగా జరిగింది. ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Published : 19 Feb 2024 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) ఇంట సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య (aishwarya shankar), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌ (Tarun Karthik)ల నిశ్చితార్థం చెన్నైలో ఆదివారం జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. వేడుకకు సంబంధిత ఫొటోలను ఐశ్వర్య సోదరి, నటి అదితి శంకర్‌ (Aditi Shankar) సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులతో నేను.. మరిచిపోలేని రోజు ఇది’ అని తన సోదరి, సోదరుడు అర్జిత్‌ను ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు.

వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్‌ రోహిత్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రోహిత్‌పై వచ్చిన ఆరోపణలు కారణంగానే ఆమె విడిపోయినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. తరుణ్‌ కార్తీక్‌.. శంకర్‌ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. శంకర్‌ ప్రస్తుతం రెండు పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ (Indian 2), రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘విరుమన్‌’తో 2022లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అదితి ఆ తర్వాత ‘మావీరన్‌’లో నటించారు. విష్ణు వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. అదితి మంచి సింగర్‌ కూడా. తాను నటించిన సినిమాల్లోని కొన్ని పాటలే కాకుండా వరుణ్‌ తేజ్‌ హీరోగా తెలుగులో తెరకెక్కిన ‘గని’లోని ‘రోమియో జూలియట్‌లా’ సాంగ్‌ ఆలపించి అలరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని