ETV Win: ఈటీవీ విన్‌లో ఆకట్టుకుంటోన్న క్రైమ్‌ కామెడీ చిత్రం

ఈటీవీ విన్‌ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. 

Published : 16 Apr 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శర్మ & అంబానీ' (sharma and ambani). ఏప్రిల్ 13న ఈటీవీ విన్‌ వేదికగా డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు విశేష ఆదరణ లభించిందని చిత్ర బృందం తెలిపింది. వజ్రాల కోసం ఓ క్రూరమైన ముఠా చేసిన పనికి శర్మ, అంబానీల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో చూపించిన తీరు అందరిలోను ఆసక్తిని కలిగిస్తుంది. సవాళ్లతో కూడిన ప్రతీ అంశాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారో దర్శకుడు చాలా తెలివిగా చూపించారంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. కార్తీక్‌ సాయి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ పల్లా, భరత్ తిప్పిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ తదితరులు నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని