Sharma And Ambani: ధన్య బాలకృష్ణన్‌ కొత్త వెబ్‌సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సరికొత్త సిరీస్‌లు, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ విన్‌లో మరో ఆసక్తికర సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 31 Mar 2024 20:27 IST

హైదరాబాద్‌: ధన్య బాలకృష్ణన్‌, భరత్‌ తిప్పిరెడ్డి కీలక పాత్రల్లో కార్తిక్‌ సాయి దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘శర్మ అండ్‌ అంబానీ’ (Sharma And Ambani). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. వరుస వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో ఓటీటీ వీక్షకులకు వినోదాలను పంచుతున్న తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. అందులో స్కూటర్‌పై ధన్య, భరత్ ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో వజ్రం, కొన్ని నోట్లు ఉండేలా డిజైన్‌ చేశారు. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తే, ఇదొక  క్రైమ్ కామెడీ సిరీస్‌లా కనిపిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి  ‘శర్మ అండ్ అంబానీ’ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని