Shivani Rajashekar: మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్‌

తనను ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్‌.

Published : 15 May 2024 21:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham) సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు నటి శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar). ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ఈనెల 17న విడుదల కానుంది. ఈసందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించింది. ట్రైలర్‌ రిలీజ్‌ అనంతరం టీమ్‌ మీడియాతో ముచ్చటింది. ‘మీరు ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. అందులో పోస్ట్‌ చేసే ఫొటోల్లో గ్లామర్‌గా ఉంటారు. ఈ సినిమాలోనూ అంతే గ్లామర్‌గా ఉంటారా?’ అనే ప్రశ్నపై శివాని స్పందించారు. ‘‘ఈ చిత్రంలో కనిపించినంత గ్లామర్‌గా నేనే సినిమాలోనూ కనిపించలేదు. ఇన్‌స్టా వినియోగించడంలో నాకంటే మా అక్క (నటి శివాత్మిక) బెటర్‌. నా సినిమాల రిలీజ్‌ సమయంలోనే నేను ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. నేను దిగిన ఎన్నో ఫొటోలు ఇంకా ఫోన్‌లోనే ఉన్నాయి. వాటిని పోస్ట్‌ చేయలేదు. అయినా మీరు నన్ను ఇన్‌ఫ్లూయెన్సర్‌ అంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది’’ అని అన్నారు.

పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేగానీ దాన్ని మనం ప్లాన్‌ చేయలేం కదా. జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అమ్మా నాన్న కూడా మా పెళ్లి విషయంలో తొందరపడడం లేదు. ప్రస్తుతానికి నా ఫోకస్‌ మొత్తం నటనపైనే’’ అని తెలిపారు. గతంలో తాను నటించిన పలు సినిమాలూ నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘ఓటీటీకి నేనంటే అభిమానం’ అని నవ్వుతూ చెప్పారు. అహంతో కూడిన ప్రేమకథ నేపథ్యంలో దర్శకుడు మణికాంత్‌ గెల్లి ‘విద్య వాసుల అహం’ రూపొందించారు. రాహుల్‌ విజయ్‌ కథానాయకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని