shruti haasan: నాకే నచ్చేలా ఉండే పాత్ర అది

‘జూలియట్‌.. ఎన్నాళ్లయ్యింది? మనం కలిసి. అసలు నీకు నేను గుర్తున్నానా?’ అంటూ తన ‘డకాయిట్‌’ సినిమా విశేషాలు ఇటీవలే ప్రకటించింది శ్రుతి హాసన్‌.

Updated : 05 Feb 2024 09:19 IST

‘జూలియట్‌.. ఎన్నాళ్లయ్యింది? మనం కలిసి. అసలు నీకు నేను గుర్తున్నానా?’ అంటూ తన ‘డకాయిట్‌’ సినిమా విశేషాలు ఇటీవలే ప్రకటించింది శ్రుతి హాసన్‌. గతేడాది ‘సలార్‌’తో మంచి విజయాన్ని అందుకొని జోరుమీదున్న ఈ భామ కొత్త సంవత్సరంలో భిన్నమైన ప్రాజెక్టులతో అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను ‘డకాయిట్‌’ అనే భిన్నమైన ప్రేమకథా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాను. అడివి శేష్‌ హీరో. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసిన ఈ సినిమాను ప్రపంచానికి చూపించడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ‘చెన్నై స్టోరీ’ అనే మరో ప్రాజెక్టు చేస్తున్నా. ఇది ఒప్పుకోవడానికి ముఖ్య కారణం.. మనసుని హత్తుకునే కథ. సాధారణంగా నాకు హ్యాపీ ఎండింగ్‌ కథలంటే ఇష్టం. ఇందులో నేను పోషించిన పాత్ర గతంలో వాటికి పూర్తి భిన్నంగా, నాకు నచ్చేలా ఉంటుంది. చెన్నై నుంచి వచ్చిన నాకు.. అదే నగరం ప్రత్యేకత గురించి సినిమా రూపంలో చెప్పే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో డిటెక్టివ్‌ అను పాత్రలో కనిపిస్తాను. మరి కొన్ని ప్రాజెక్టుల వివరాలు త్వరలో తెలియజేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని