shruti haasan: దెయ్యంలా ఉన్నావన్నా పట్టించుకోను

‘అందరూ అందరికీ నచ్చరు. ఎవరైనా నన్ను దెయ్యం, భూతం అని పిలిచినా దాన్ని పొగడ్తగానే భావిస్తాను తప్ప బాధ పడను’ అంటోంది శ్రుతి హాసన్‌. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టం.

Updated : 30 Jan 2024 09:25 IST

‘అందరూ అందరికీ నచ్చరు. ఎవరైనా నన్ను దెయ్యం, భూతం అని పిలిచినా దాన్ని పొగడ్తగానే భావిస్తాను తప్ప బాధ పడను’ అంటోంది శ్రుతి హాసన్‌. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఆ రంగు దుస్తులతోనే కనిపిస్తుంటుంది. దీనిపై తరచూ ట్రోల్స్‌ వస్తుండటంతో పైవిధంగా స్పందించింది శ్రుతి. ‘ఒక మహిళా ఆర్టిస్టు పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలకు భయపడటం, బాధ పడటంలాంటివి నేనేమీ చేయను’ అని కుండబద్దలు కొట్టేసింది. ‘నాకు మొదట్నుంచీ నలుపు రంగు, లోహాభరణాలు ధరించడం ఇష్టం. మెటల్స్‌ని కేవలం సంగీతంపై ఇష్టం ఉన్నవారు మాత్రమే ధరించరు. అవి నాలో శక్తిని రెట్టింపు చేస్తాయి. ఈ ఆభరణాలు నచ్చని కొందరు దెయ్యంలా ఉన్నావని కామెంట్‌ చేస్తుంటారు. అలాంటి ట్రోల్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను’ అంటూ విమర్శలకు సమాధానం చెప్పింది. తను నేచురల్‌ బ్యూటీ కాదని వస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తూ ‘ఆ విషయం నేనూ ఒప్పుకుంటా. కానీ అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు ఎంతో ఇష్టపడతా’ అని ముగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు