Shruti Haasan: అతనెవరో నాకు తెలియదు.. ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై స్పందించిన శ్రుతి హాసన్‌..

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన చేదు అనుభవం గురించి శ్రుతి హాసన్‌ (Shruti Haasan) మాట్లాడారు. తనను వెంబడించిన వ్యక్తి ఎవరో తెలియదని చెప్పారు.

Updated : 21 Sep 2023 13:08 IST

హైదరాబాద్‌: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నటి శ్రుతి హాసన్‌కు (Shruti Haasan) ఇటీవల చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో ఆమె నడుస్తుండగా ఓ వ్యక్తి అభిమానినంటూ ఆమెను వెంబడించాడు. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌ లోపలి నుంచి కారు ఎక్కే వరకు ఫాలో అయ్యాడు. దీంతో భయపడిన శ్రుతి అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి జారుకొన్నాడు. తాజాగా ఈ విషయంపై ఆమె తన ఇన్‌స్టా చిట్‌చాట్‌లో మాట్లాడారు. అతనెవరో తనకు తెలియదని అన్నారు.

‘‘నేను ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. ఫొటో కోసం అనుకున్నాను. అంతలో ఫొటోగ్రాఫర్‌ ఆమె పక్కకు వెళ్లి నిల్చొమని అతడికి చెప్పాడు. వాళ్లిద్దరూ స్నేహితులేమో అనుకున్నా. కానీ, అతడు నాకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించింది. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాను. వ్యక్తిగత అంగరక్షకులను పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకూ బాడీ గార్డ్స్‌ను పెట్టుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించాలేమో’’ అని శ్రుతి హాసన్‌ చెప్పారు. అలాగే ఈ ప్రశ్న అడిగినందుకు అభిమానికి శ్రుతి ధన్యవాదాలు తెలిపారు. 

ఆ ఏడాది నాతో సమానంగా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే: రాశి

ఇక సినిమాల విషయానికొస్తే..  శ్రుతి హాసన్‌ ‘సలార్‌’లో (Salaar) నటిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా రానున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 28న రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘హాయ్‌ నాన్న’లోనూ శ్రుతి హాసన్‌ కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు