Yash: యశ్‌ ‘టాక్సిక్‌’.. తెరపైకి మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు!

యశ్‌ (Yash) నటిస్తోన్న ‘టాక్సిక్‌’ (Toxic)లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Published : 21 Mar 2024 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కన్నడ స్టార్‌ హీరో యశ్‌ ఇటీవల ‘టాక్సిక్‌’ (Toxic) చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో యశ్‌ సరసన నటించనున్న కథానాయికలపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇటీవల సాయిపల్లవి, కరీనా కపూర్‌ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అడ్వాణీ (Kiara Advani) ‘టాక్సిక్‌’లో నటించనున్నట్లు సమాచారం. అలాగే శ్రుతిహాసన్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని శ్రుతి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ (Kareena kapoor) కీలకపాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె టీమ్ స్పందిస్తూ.. ‘‘కరీనాకపూర్‌ తదుపరి ప్రాజెక్ట్‌ గురించి పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మీ ఆసక్తిని మేము అర్థం చేసుకోగలం. అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి కథనాలు ప్రచురించవద్దని కోరుతున్నాం’’ అని పేర్కొనడంతో వాటికి చెక్‌ పడింది.

యశ్‌ నటిస్తోన్న 19వ చిత్రమే ‘టాక్సిక్‌’. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్‌. ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ ప్రియులను అలరించే కథాంశంతో ఇది సిద్ధమవుతోన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని