shruti haasan: శ్రుతి కొత్త ప్రయాణం మొదలు

చరిత్రలో దాగి ఉన్న ఎన్నో కథలను ప్రపంచానికి తెలియజేయడానికి వస్తున్నామంటూ ఇటీవలే తన రాబోయే చిత్రం ‘చెన్నై స్టోరీ’ని ప్రకటించింది శ్రుతిహాసన్‌

Updated : 02 Apr 2024 09:39 IST

చరిత్రలో దాగి ఉన్న ఎన్నో కథలను ప్రపంచానికి తెలియజేయడానికి వస్తున్నామంటూ ఇటీవలే తన రాబోయే చిత్రం ‘చెన్నై స్టోరీ’ని ప్రకటించింది శ్రుతిహాసన్‌. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిలిప్‌ జాన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనుంది శ్రుతి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ‘‘కొత్త సినిమా... కొత్త ప్రయాణం’ అనే వ్యాఖ్యతో ఓ వీడియోను అభిమానులతో పంచుకుందామె. ఈ చిత్రంలో వివేక్‌ కల్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ‘ఇనిమేల్‌’ అనే మ్యూజికల్‌ వీడియోసాంగ్‌తో లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ప్రేక్షకులను పలకరించిన శ్రుతి.. ప్రస్తుతం ‘సలార్‌ 2’, ‘డెకాయిట్‌’ చిత్రాలతో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని