Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమని నమ్ముతున్నా: శృతిహాసన్‌

హీరోయిన్‌ శృతిహాసన్‌ తాను నటించిన ‘ఇనిమేల్‌’ పాట గురించి తెలిపారు.

Published : 25 Mar 2024 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) హీరోయిన్‌ శృతిహాసన్‌ (Shruti Haasan) ఓ స్పెషల్‌ సాంగ్‌లో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌కు ‘ఇనిమేల్‌’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్‌ అందించారు. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాలు శృతిహాసన్‌ తెలిపారు. ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ అందరికీ దర్శకుడిగానే తెలుసు. సూపర్‌ చిత్రాలు అందించి దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఈ పాటతో తనలో నటుడిని పరిచయం చేస్తున్నారు. ప్రేమనేది ఒక భ్రమని నా నమ్మకం. ప్రేమలో ఉన్న ఇద్దరి బంధాన్ని నాలుగు నిమిషాల్లో చూపించాలనుకున్నా. భవిష్యత్తులో ఒక బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలిస్తే మీరు అందులో ఉంటారా? లేదా? అన్న ప్రశ్న పాట రూపంలో మీ ముందుకువస్తోంది. వేరువేరు ప్రదేశాల్లో మూడు రోజులు షూటింగ్‌ చేశాం. ఈ పాట కోసం నాన్నతో కలిసి వర్క్‌ చేశాను. మరోసారి ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాన్న గొప్ప రచయిత, నటుడు. ఆయన తన పనిలో ఎంత బిజీగా ఉన్నా ఫోన్‌ చేసి ప్రతీ విషయం తెలుసుకునేవారు. ఆయనలా నేను కష్టపడి పని చేస్తాను. ఒకరిపై ఆధారపడను. గత ఏడాది వచ్చిన విజయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నా’’ అని శృతిహాసన్‌ వెల్లడించారు.

ప్రస్తుతం శృతిహాసన్‌ అడవి శేష్‌ సరసన ‘డకాయిట్‌’లో నటిస్తున్నారు. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని