Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ నటించిన ఇంగ్లిష్‌ చిత్రం ‘ది ఐ’. ఈ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో పలు విభాగాల్లో నామినేట్‌ అయిందని ఆమె తెలిపారు.

Published : 01 Oct 2023 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో కమల్ హాసన్‌ తనయగా తెరంగేట్రం చేసినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్‌ (Shruti Haasan). విభిన్న పాత్రలతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించిన ఆమె త్వరలోనే ఇంగ్లిష్‌ చిత్రం ‘ది ఐ’ (The Eye)తో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా పలు విభాగాల్లో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు నామినేట్‌ అయిందని తెలియజేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. ‘‘ఈ చిత్రం ‘గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్స్‌’కు బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ విభాగంలో నామినేట్‌ అయింది. బెస్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘లండన్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు నామినేట్‌ అయింది. కోర్ఫు దీవుల్లో పర్యావరణ హితంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. అయితే, విడుదల తేదీని ప్రకటించలేదు.

‘ది వ్యాక్సిన్‌ వార్‌’.. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!

‘ది లాస్ట్‌ కింగ్‌డమ్‌’ ఫేమ్‌ మార్క్‌ రౌలీ ఈ సినిమాలో కథానాయకుడు. డాప్నే ష్మోన్‌ దర్శకత్వం వహించారు. ఓ దీవిలో మరణించిన తన భర్త అస్థికల కోసం తిరిగి అక్కడికి వెళ్లిన ఓ యువ వితంతువు నేపథ్యంలో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. మరోవైపు, ప్రభాస్‌ (Prabhas) సరసన శ్రుతి హాసన్‌ నటించిన ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ (Salaar) డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె కీలక పాత్ర పోషించిన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) త్వరలోనే విడుదల కానుంది. నాని (Nani) హీరోగా రూపొందుతున్న సినిమా ఇది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు