Shruti Haasan: లోకేశ్‌ కనగరాజ్‌తో నా కెమిస్ట్రీ.. అందుకే వర్క్‌వుట్‌ అయింది: శ్రుతి హాసన్‌

లోకేశ్‌ కనగరాజ్‌ చాలా గొప్ప నటుడని శ్రుతి హాసన్‌ అన్నారు. తాజాగా విడుదలైన ‘ఇనిమేల్’ గురించి ఆమె మాట్లాడారు.

Updated : 31 Mar 2024 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇనిమేల్’ అంటూ ప్రత్యేక గీతంతో అలరించారు నటి శ్రుతి హాసన్‌ (Shruti Haasan). స్టార్‌ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ఆమె నటించిన ఈ పాట తాజాగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. దంపతుల మధ్య ఉండే బంధాన్ని ఇందులో నాలుగు నిమిషాల్లో చూపించారు. ఇక ఈ పాటలో లోకేశ్‌, శ్రుతిల కెమిస్ట్రీ బాగుందని కామెంట్లు వినిపించాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించారు.

‘‘జీవితకాలపు బంధాన్ని ఒక్క పాటలో చూపించడం సవాలుగా అనిపించింది. అందరికీ నచ్చేలా తీయాలని తాపత్రయపడ్డాం. లోకేశ్ కెమెరా ముందు బాగా నటించారు. అతడు గొప్ప దర్శకుడే కాక, నటుడని కూడా అందరికీ అర్థమైంది. ఈ పాట చేయడానికి ఆయన అంగీకరించినప్పుడు చాలా ఆనందించా. ఎంతో ఉత్సాహంగా పనిచేశాను. ఆయన సహజంగా ఎలా ఉంటారో అలానే ఇందులో చూపించాం. మేమిద్దరం స్నేహితులం. అందుకే మా ఇద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై బాగుంది. ఈ పాట మొదట ఇంగ్లిష్‌లో రాశాను. దీనికి మ్యూజిక్‌ కంపోజ్‌ చేసేటప్పుడు తమిళంలో కోరస్‌ ఉంటే బాగుండనిపించింది. ఇదేమాట నాన్న(కమల్‌ హాసన్‌)తో చెప్పాను. ఆయన తమిళంలో పూర్తి సాహిత్యాన్ని అందించారు’ అన్నారు.

శ్రుతి సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్‌’ (Salaar)తో మంచి విజయాన్ని అందుకున్న ఆమె.. ప్రస్తుతం ‘డెకాయిట్‌’లో నటిస్తున్నారు. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ఆమె నటించిన హాలీవుడ్‌ మూవీ ‘ది ఐ’ త్వరలోనే విడుదల కానుంది. దీనితో పాటు యశ్‌ హీరోగా తెరకెక్కనున్న టాక్సిక్‌లోనూ శ్రుతి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని