Siddharth: అదితిరావు హైదరీతో పెళ్లి.. సిద్ధార్థ్‌ ఏమన్నారంటే?

నటి అదితిరావు హైదరీ (Aditi Rao hydari)తో తనకున్న స్నేహం గురించి నటుడు సిద్ధార్థ్‌  (Siddharth) మాట్లాడారు. అదితితో తన వివాహమంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన స్పందించారు.

Published : 01 Dec 2023 21:32 IST

హైదరాబాద్‌: నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari), నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలపై తాజాగా సిద్ధార్థ్‌ స్పందించారు.

సెలబ్రిటీ టాక్‌ షోలో పాల్గొన్న ఆయన్ను.. ‘‘అదితిరావు హైదరీని మీరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్వీన్‌ ఆఫ్‌ మై హార్ట్‌ అంటూ ఇటీవల ఆమె కోసం పోస్ట్‌ పెట్టారు కదా’’ అని అడగ్గా.. ‘‘నాకింకా పెళ్లి ఫిక్స్‌ కాలేదు. అదితి పుట్టినరోజు నాడు నేను ఆ పోస్ట్‌ పెట్టాను. (అదితి అభిమానులను ఉద్దేశించి) ఎంతోమంది హృదయాలకు ఆమె యువరాణి’’ అని బదులిచ్చారు.

Animal movie review: రివ్యూ: యానిమల్‌.. రణ్‌బీర్‌-సందీప్‌ వంగా యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

2021లో విడుదలైన ‘మహాసముద్రం’ కోసం సిద్ధార్థ్‌, అదితి తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. రెస్టారెంట్స్‌, పలు ఈవెంట్స్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లడం, రీల్స్‌ చేయడంతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని.. తాము మంచి స్నేహితులమంటూ ఇప్పటికే పలుమార్లు సిద్ధార్థ్‌, అదితి స్పష్టతనిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని