Siddharth Roy: చెన్నైలో ఉండి బతికిపోయాడు: రథన్‌పై డైరెక్టర్‌ ఫైర్‌

‘సిద్ధార్థ్‌ రాయ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు రథన్‌పై దర్శకుడు వి.యశస్వి ఫైర్‌ అయ్యారు. కారణమేంటంటే?

Updated : 22 Feb 2024 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీత దర్శకుడు రథన్‌ ( Radhan) చెన్నైలో ఉండి బతికిపోయాడని, ఇక్కడ ఉండి ఉంటే గొడవలు అయ్యేవని నూతన దర్శకుడు వి.యశస్వి ( V Yeshasvi) ఫైర్‌ అయ్యారు. తాను తెరకెక్కించిన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌పై ఆరోపణలు చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ త్వరగానే పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ చాలా ఆలస్యమైంది. దానికి కారణం రథన్‌. నాలా ఇంకెవరూ మోసపోవద్దని ఇదంతా చెబుతున్నా. అతడు అద్భుతమైన టెక్నీషియన్‌ కావొచ్చు. కానీ, ఇలా చేస్తుండటం వల్ల సినిమా కిల్‌ అయిపోతుంది. ఎప్పుడూ గొడవ పడేందుకే మాట్లాడతాడు’’ అని అన్నారు. రథన్‌ తీరుపై దర్శకుడు సందీప్‌ వంగా రెడ్డి కూడా గతంలో అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘అర్జున్‌ రెడ్డి’ విషయంలో అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా ట్యూన్స్‌ ఇచ్చారని, అందుకే నేపథ్య సంగీతాన్ని హర్షవర్ధన్‌ రామేశ్వర్‌తో చేయించామని చెప్పారు. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘హుషారు’, ‘జాతి రత్నాలు’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర సినిమాలకు రథన్‌ పనిచేశారు.

‘అతడు’, ‘ఆర్య’, ‘భద్ర’, ‘లెజెండ్‌’ తదితర చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన దీపక్‌ సరోజ్‌ (Deepak Saroj) ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ (Siddharth Roy)తో హీరోగా మారారు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో తన్వి నేగి హీరోయిన్‌. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని