siddhu jonnalagadda: మంచి కథలు నా వద్దకు వచ్చేవి కాదు: సిద్ధు జొన్నలగడ్డ

‘టిల్లు స్క్వేర్‌’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు.

Published : 25 Mar 2024 17:06 IST

హైదరాబాద్‌: ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో మంచి హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda).  ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సినిమాకు మల్లిక్‌రామ్‌ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘కెరీర్‌ ప్రారంభంలో మంచి కథలు నా వద్దకు వచ్చేవి కాదు. నా పాత్ర ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలని నాకు నచ్చేలా కథలు రాయడం మొదలు పెట్టాను. కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా స్టోరీస్‌ రాయడం బాగుంది. ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తూ రాస్తున్నా. సినిమా విషయానికి వస్తే ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ అనుకున్నప్పుడు డైరెక్టర్‌ విమల్‌ కృష్ణ అందుబాటులో లేరు. దాంతో మల్లిక్‌తో ‘టిల్లు స్క్వేర్‌’ తెరకెక్కించాం. ఆయనతో సినిమా చేయాలని ముందే అనుకున్నా. అది ఈవిధంగా కుదిరింది. ఇటీవల విడుదలైన ట్రెలర్‌లో విభిన్నమైన అంశాలు ఉన్నా అందరూ అనుపమ క్యారెక్టర్‌ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒక నటిగా కథలో ఆమె పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇది ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ట్రెలర్‌ చూసి నిర్ణయానికి రావొద్దు. ఇందులో మేమేం చూపించలేదు. ఎందుకంటే సినిమాలో అన్ని సన్నివేశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. మా అంచనాలను నిజం చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని సిద్ధు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని