Tillu Square: ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌ అనగానే..: సిద్ధు జొన్నలగడ్డ

‘టిల్లు స్క్వేర్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రమిది.

Published : 14 Feb 2024 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). త్వరలోనే ఆ సినిమా సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 29న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక (Tillu Square Trailer Launch Event) నిర్వహించింది. ట్రైలర్‌ విడుదల అనంతరం సిద్ధు, నిర్మాత నాగవంశీ (Naga Vamsi) తదితరులు అభిమానులనుద్దేశించి మాట్లాడారు. సినిమాలోని డైలాగ్‌ చెప్పి సిద్ధు సందడి చేశారు. పలువురికి టీ షర్టులను కానుకగా అందించారు.

‘‘వాలెంటైన్స్‌ డే అయినా మీరంతా ఇక్కడికొచ్చి నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. టూర్‌లో ఉండడం వల్ల అనుపమ పరమేశ్వరన్‌ రాలేకపోయింది. ‘డీజే టిల్లు’ విషయంలో మీరిచ్చిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేను. దానికి పార్ట్‌ 2 రూపొందిద్దామని నిర్మాతలనగానే షాకయ్యా. ఏం చేయాలో అర్థంకాలేదు. దాన్నుంచి తేరుకుని ప్రారంభించాం. మీ అందరినీ కుర్చీలోంచి లేవకుండా ఎంటర్‌టైన్‌ చేసేందుకు టైమ్‌ తీసుకున్నా. పర్‌ఫెక్ట్‌ ప్రొడక్ట్‌ కోసమే గ్యాప్‌ వచ్చింది’’ అని సిద్ధు తెలిపారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వరకు అనుపమను మీకు చూపించకూడదనుకుంటున్నామని నాగవంశీ నవ్వులు పంచారు.

విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022 ఫిబ్రవరిలో రిలీజ్‌)లో టిల్లుగా తనదైన మార్క్‌ చూపించారు సిద్ధు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌తో కట్టిపడేశారు. హీరోయిన్‌ నేహాశెట్టి.. రాధిక పాత్రలో నటించి విశేషంగా అలరించారు. దాంతో, ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, ‘జాక్‌’ (Jack), ‘తెలుసు కదా’ (Telusu Kada) చిత్రాల్లో నటిస్తున్నారు సిద్ధు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని