సిద్ధార్థ్‌.. కృతి.. ఓ ప్రేమకథ?

‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్‌ నాయిక కృతి సనన్‌.

Published : 19 May 2024 00:39 IST

‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్‌ నాయిక కృతి సనన్‌. త్వరలో ‘దో పత్తి’తో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్న ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ‘యోధ’తో మంచి విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ఆమె జోడీ కట్టునున్నట్లు సమాచారం. ‘‘మడాక్‌ ఫిలింస్‌ మరో సరికొత్త జోడీని తెరకు పరిచయం చేయనుంది. కృతి, సిద్ధార్థ్‌ కలయికలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను సిద్ధం చేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మొదటిసారి రాబోతున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి వీరిద్దరితో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలో వెల్లడించడానికి సన్నాహాలు చేస్తున్నారు’’ అని చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌ ‘స్పైడర్‌’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు