Sitara: నాన్నకు ఇష్టం ఉండదు: వైరల్‌ వీడియోపై మహేశ్‌ బాబు కుమార్తె

మహేశ్‌బాబుకు సంబంధించి ఇటీవల వైరల్‌ అయిన ఓ వీడియోపై ఆయన కుమార్తె సితార స్పందించింది.

Published : 26 May 2024 13:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) హెయిర్‌కు సంబంధించి ఓ వీడియో ఇటీవల వైరల్‌ అయింది. తన సోదరి మంజుల.. జుట్టు పట్టుకుని లాగడం, దానికి మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నెటిజన్లను ఆకర్షించాయి. కానీ, మంజులను మహేశ్‌ను ఏమన్నారో ఎవరికీ తెలియదు. మహేశ్‌ కుమార్తె సితార (Sitara) నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు. సితారతో వారు చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ‘మీ డాడీ జుట్టుని మీ అత్తయ్య పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?’ అని అడగ్గా.. ‘నా జుట్టు పట్టుకోవద్దు’ అని మహేశ్‌ అన్నారని సితార చెప్పింది. ఎవరైనా తన జుట్టు పట్టుకోవడం తన తండ్రికి ఇష్టం ఉండదని తెలిపింది.

ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా మహేశ్‌ హాజరయ్యారు. అక్కడ చోటుచేసుకుందా దృశ్యం. రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న సినిమా కోసం మహేశ్‌ జుట్టు పెంచారని సమాచారం. 2024-25 అకడమిక్‌ ఇయర్‌లో 7వ తరగతి చదవనున్న సితార.. తనకు నూడుల్స్‌ అంటే బాగా ఇష్టమని తెలిపింది. నటనపై ఆసక్తి ఉందని, ఇండస్ట్రీలోకి వస్తానని తెలిపింది. నటన విషయంలో తన తండ్రి,  ఫ్యాషన్‌లో తల్లి నమ్రతా శిరోద్కర్‌ తనకు స్ఫూర్తి అని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని