Mad 2: సూపర్‌హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

ఎన్టీఆర్‌ బామ్మర్ది నార్నే నితిన్‌ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్‌’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Published : 19 Apr 2024 15:31 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ బామ్మర్ది నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’ (MAD). కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (MAD Square) రూపొందిస్తున్నట్లు చిత్ర నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా ప్రకటించింది. ‘‘మరో స్థాయిలో వినోదాన్ని అందించేందుకు మ్యాడ్‌ టీమ్‌ మళ్లీ కలిసింది. ఇక ఇప్పుడు, మ్యాడ్‌నెస్‌ రెట్టింపు ఉండనుంది’’ అని పేర్కొంది. ఈమేరకు, ఉగాది రోజున ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

నార్నే నితిన్‌ నటుడిగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్‌’. గౌరీప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌లో చిన్న చిత్రంగా విడుదలైన ఇది బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ నటీనటుల కామెడీ టైమింగ్‌కు సినీ ప్రియులు కడుపుబ్బా నవ్వుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని