Sivakarthikeyan: శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్‌.. శివకార్తికేయన్‌

శివకార్తికేయన్‌తో కలిసి ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు స్టెప్పులేశారు శ్రీలీల.

Updated : 24 Mar 2024 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనతి కాలంలోనే స్టార్‌ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు శ్రీలీల (Sreeleela). సంక్రాతి కానుకగా విడుదలైన మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇందులోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు చాలా మంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన కల్చరల్‌ ఈవెంట్‌లో శ్రీలీల హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో ఈ పాటకు హుక్‌ మూమెంట్స్‌ వేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్‌ అని శివకార్తికేయన్‌ ఈ సందర్భంగా కొనియాడారు. శివకార్తికేయన్‌ జీవితం అందరికీ ఆదర్శమని శ్రీలీల ప్రశంసించారు.

ప్రస్తుతం శ్రీలీల ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్రైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏఆర్‌ మురుగదాస్‌ చిత్రంలో శివకార్తికేయన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్‌ బ్యానరుపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని