Mahaveerudu: పోస్టర్‌ చించితే ఏమైంది?

యముడు తప్పు చేసినా కూడా నిలదీయటం ఖాయం అంటున్నారు కథానాయకుడు శివకార్తికేయన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తోంది. మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 04 Jul 2023 14:16 IST

ముడు తప్పు చేసినా కూడా నిలదీయటం ఖాయం అంటున్నారు కథానాయకుడు శివకార్తికేయన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తోంది. మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో వార్తాపత్రికలో పని చేసే కార్టూనిస్ట్‌ పాత్రను పోషిస్తున్నారు శివకార్తికేయన్‌. ఆయన ఒక భయస్థుడి పాత్రలో కనిపిస్తూ... అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడి పోస్టర్‌ చించడం వలన ఎలాంటి ఇబ్బందుల్లో పడతాడనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో మిస్కిన్‌ ప్రతినాయకుడు. సునీల్‌, యోగిబాబు, సరిత తదితరులు కీలక పాత్రలు పోషించారు. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. జులై 14న ఈ సినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని