Sivakarthikeyan: కశ్మీర్‌లో యాక్షన్‌ షురూ

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ సంయుక్త నిర్మాణంలో ఓ చిత్రం రూపొందుతోంది.

Updated : 06 May 2023 07:06 IST

శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) కథానాయకుడిగా కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ సంయుక్త నిర్మాణంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తోంది. ఈ సినిమా కశ్మీర్‌లో శుక్రవారం ప్రారంభమైంది. దేశభక్తి కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. రెండు నెలల పాటు కశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ కొనసాగనుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నారు. సి.హెచ్‌.సాయి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

జులైలో ‘మహావీరుడు’..: శివ కార్తికేయన్‌, అదితి శంకర్‌ జంటగా మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మహావీరుడు’. అరుణ్‌ విశ్వ నిర్మాత. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని