Sivakarthikeyan: కమెడియన్లను తక్కువ అంచనా వేయకండి: శివ కార్తికేయన్‌

సూరి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గరుడన్‌’. ఈ సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కు శివ కార్తికేయన్‌, విజయ్‌ సేతుపతి తదితరులు హాజరయ్యారు.

Published : 21 May 2024 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏ కమెడియన్‌నూ తక్కువ అంచనా వేయకండి’ అని అన్నారు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan). అన్నింటికంటే హాస్యాన్ని పండించడం నటులకు చాలా కష్టమని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన ‘గరుడన్‌’ (Garudan) సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు సూరి (Soori) ప్రతిభను కొనియాడారు. అతడు ఏ క్యారెక్టర్‌లోనైనా ఒదిగిపోగలడని ప్రశంసించారు. ‘‘సీరియస్‌ రోల్స్‌ ప్లే చేసే కొందరు నటులు హాస్యాన్ని పండించలేరు. కానీ, కమెడియన్లు అందరూ సీరియస్‌ క్యారెక్టర్‌లో నటించగలరు’’ అని అన్నారు. ఈ ఈవెంట్‌కు మరో హీరో విజయ్‌ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్‌ సైతం అతిథులుగా పాల్గొన్నారు.

కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోగా మారిన వారిలో సూరి ఒకరు. తాను ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘విడుదలై పార్ట్‌ 1’ (Viduthalai Part 1) గతేడాది విడుదలై, తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఆ ఉత్సాహంతో ‘గరుడన్‌’లో నటించారు. దర్శకుడు ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ డ్రామా మూవీ ఈనెల 31న తమిళంలో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని