Ram: ‘స్కంద’ పూర్తి

చివరి పాట చిత్రీకరణతో ‘స్కంద’ సినిమా పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రచార కార్యక్రమాల్ని షురూ చేయనున్నట్టు వెల్లడించాయి.

Updated : 10 Aug 2023 13:51 IST

చివరి పాట చిత్రీకరణతో ‘స్కంద’ సినిమా పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రచార కార్యక్రమాల్ని షురూ చేయనున్నట్టు వెల్లడించాయి. ‘అఖండ’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో రామ్‌ - శ్రీలీలపై  చివరి పాటని తెరకెక్కించారు. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టు చిత్రబృందం తెలిపింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల కానుంది.  ‘‘భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదలవుతుంది. రామ్‌ - శ్రీలీల జోడీ చేసే సందడి ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని