sonakshi sinha: ఫరీదాన్‌.. ఓ మాయాజాలం

ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. రత్నంలా మెరిసే ఫరీదాన్‌ జీవితంలో కూడా ఓ రహస్యం ఉంది.

Updated : 04 Apr 2024 09:44 IST

ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. రత్నంలా మెరిసే ఫరీదాన్‌ జీవితంలో కూడా ఓ రహస్యం ఉంది. మరి తన గతాన్ని తెలుసుకోవాలంటే ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ చూడాల్సిందే. ఫరీదాన్‌ పాత్రలో సోనాక్షి సిన్హా, తదితర పాత్రల్లో మనీషా కోయిరాలా, అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌ నటిస్తున్న సిరీస్‌ ఇది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా రానున్న ఈ సిరీస్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే తొలిపాటతో అలరించింది సిరీస్‌ బృందం. తాజాగా సోనాక్షి ప్రధాన పాత్రలో రూపొందిన ‘తిలస్మీ బాహే’ అనే రెండవ పాటను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ‘తను ఒక మాయాజాలం. ఫరీదాన్‌ ప్రపంచానికి స్వాగతం’ అంటూ రాసుకొచ్చింది. మెరిసే చీరలో సోనాక్షి వేస్తున్న స్టెప్పులు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ పాటకు ఏఎం తురాజ్‌ సాహిత్యం అందించగా, శర్మిష్ట చటర్జీ ఆలపించారు. మే 1న ఈ సిరీస్‌ ఓటీటీలో అభిమానులను అలరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని