SonyLIV: సోనీలివ్‌ కస్టమర్లకు అప్‌డేట్‌.. OTT నుంచి Live TV ఛానెల్స్‌ కట్‌!

SonyLIV to discontinue Live TV Channels: సోనీలివ్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం లైవ్‌టీవీ ఛానెళ్లకు వీడ్కోలు పలకనుంది. ఆగస్టు 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Published : 25 Jul 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ఛానెల్‌ సోనీలివ్‌ (SonyLIV) తన ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాంలో కీలక మార్పు చేయబోతోంది. త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి సోనీ లైవ్‌ టీవీ ఛానెళ్లను (Live TV Channels) తొలగిస్తోంది. ఆగస్టు 30 నుంచి ఈ మార్పులు తీసుకురాబోతోంది. ప్రస్తుతానికి సోనీలివ్‌ ఓటీటీ యాప్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు లైవ్‌ ఛానెళ్లనూ వీక్షించే సదుపాయం ఉంది. ఇకపై ఆ జాబితా నుంచి లైవ్‌ ఛానెళ్లు కనుమరుగుకానున్నాయి.

‘జవాన్‌’లో మరో స్టార్‌ హీరో

సోనీ ఛానెళ్లలో వచ్చే సినిమాలు, ఇతర ప్రోగ్రాములు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఆ మేరకు సోనీలివ్‌ సబ్‌స్క్రైబర్లకు సందేశాలు పంపుతోంది. తన టర్మ్‌ ఆఫ్‌ యూజ్‌ పాలసీలో మార్పులు చేస్తోంది. అయితే, లైవ్‌ టీవీ ఛానెళ్లను తొలగించడానికి గల కారణమేంటన్నది మాత్రం సోనీ వెల్లడించలేదు. సోనీలివ్‌లో ప్రస్తుతం సోనీ టీవీ, SAB TV, సోనీ మరాఠి, సోనీ మ్యాక్స్‌, బీబీసీ ఎర్త్‌తో పాటు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ (ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు స్పోర్ట్స్‌ ఛానెళ్లను ఓటీటీ వేదికగా ప్రసారం చేస్తోంది. సోనీలివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు రూ.299 (నెలకు) నుంచి ఉన్నాయి. రూ.599 (ఏడాదికి సింగిల్‌ మొబైల్‌), రూ.699 (6 నెలలు), రూ.999 వరకు (ఏడాది) ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని