Baak: పాట పంచుకో

అందమైన ఓ కథానాయిక తెరపై కనిపిస్తోందంటే చాలు... కళ్లన్నీ అటువైపే వెళతాయి.

Updated : 15 Apr 2024 12:08 IST

అందమైన ఓ కథానాయిక తెరపై కనిపిస్తోందంటే చాలు... కళ్లన్నీ అటువైపే వెళతాయి. అలాంటిది ఇద్దరు అందగత్తెలు పోటీపడి ఓ పాటని పంచుకుంటే? సినీ ప్రియులకి కనుల పండుగే కదా. ‘బాక్‌’ సినిమా కోసం అగ్ర కథానాయికలు తమన్నా, రాశీ ఖన్నా అదే చేశారు. ‘పంచుకో...’ అంటూ సాగే పాటలో ఇద్దరూ వాళ్ల అందచందాలతోనూ, నృత్యాలతోనూ అదరగొట్టారు. ఈ సందడిని పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ నెల 26న విడుదలవుతున్న ‘బాక్‌’ చిత్రం చూడాల్సిందే. సుందర్‌.సి దర్శకత్వం వహిస్తూ, ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రమిది. ఇందులోని ‘పంచుకో...’ అంటూ సాగే ప్రోమో గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. సాహితీ గీతాన్ని రచించగా, రాఘవి ఆలపించారు. హిప్‌హాప్‌ తమిళ స్వరాలు సమకూర్చారు. హారర్‌ కామెడీ కథతో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్‌, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని