Tollywood: కలిసొస్తాం చేసేస్తారా కథలు సిద్ధం

కొందరు ఇప్పటికే కలిసి నటిస్తున్నారు... ఇంకొందరు తాము రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారు... ఈ దశలోనే కొన్ని ఆసక్తికరమైన కలయికలూ ప్రచారంలోకి వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే...  2024లో మల్టీస్టారర్‌ చిత్రాలు మరిన్ని ప్రేక్షకుల ముందుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Updated : 14 Jan 2024 09:42 IST

కొత్త ఏడాదిలో మల్టీస్టారర్‌ చిత్రాలపై జోరుగా చర్చ

కొందరు ఇప్పటికే కలిసి నటిస్తున్నారు... ఇంకొందరు తాము రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారు... ఈ దశలోనే కొన్ని ఆసక్తికరమైన కలయికలూ ప్రచారంలోకి వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే...  2024లో మల్టీస్టారర్‌ చిత్రాలు మరిన్ని ప్రేక్షకుల ముందుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గ్ర కథానాయకుడు వెంకటేశ్‌ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... వెంకీతో కలిసి నటించడానికి సై అని చెప్పారు. వెంకటేశ్‌ కూడా ఆయన కూర్చుని సైగ చేస్తే చాలు.. వెనక నుంచి నేను వచ్చేస్తా అని చెప్పేశారు. ఇక కావల్సింది కథే అన్నమాట. మరో అగ్ర కథానాయకుడు నాగార్జున... యువతరం హీరోలు అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌తో కలిసి ‘నా సామిరంగ’ చేశారు. తాజాగా వెంకటేశ్‌ - నాని కథానాయకులుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా అనే ప్రచారం చిత్రసీమలో ఊపందుకుంది. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావొచ్చంటున్నారు. నిజమా కాదా అనేది కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. కానీ ఏడాది ఆరంభంలోనే మల్టీస్టారర్‌ చిత్రాలపై  టాలీవుడ్‌లో నడుస్తున్న చర్చ సినీ ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.

  • కొన్నేళ్లుగా మల్టీస్టారర్‌ చిత్రాలు అడపాదడపా సందడి చేస్తూనే ఉన్నాయి. అభిమాన హీరోల్ని కలిసి చూడాలనే  కోరికని కొంత మేర తీరుస్తున్నాయి. వాటితోపాటే కొత్త  రకమైన కథలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంచి   పరిణామమే. అయితే వాటి సంఖ్య మరింత పెరిగితే చూడాలనేది ప్రేక్షకుల కోరిక. కథలు రాయొచ్చు కానీ.. కథా నాయకులు కలిసి నటిస్తారా? అనే అభిప్రాయం వినిపించేది గతంలో. కానీ ఇప్పుడు కథానాయకులే ‘తమకు తగిన కథలొస్తే రెడీ’ అంటున్నారు. గతేడాది రవితేజ - నాని కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కలిసి సినిమా చేద్దామనే ఓ నిర్ణయం తీసుకున్నారు. రవితేజ, కొందరు యువ కథానాయకుల కలయికలో కొన్ని ప్రాజెక్టులు కూడా ప్రచారంలో ఉన్నాయి. అందుకోసం స్క్రిప్ట్‌లు కూడా సిద్ధమైనట్టు పరిశ్రమ వర్గాలు మాట్లాడుకున్నాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. కథానాయకులు ఇద్దరికీ సమయం కుదిరినప్పుడే ఇలాంటి చిత్రాలు పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయి.

మార్కెట్‌ లెక్కలు కుదరాలి!

ఈ మధ్య సీనియర్‌ హీరోలు, యువతరం కథానాయకుల కలయికల్లో సినిమాలు కుదురుతున్నట్టుగా... ఒకే స్థాయి తారల సినిమాలు కుదరడం లేదు. గతేడాది చిరంజీవి - రవితేజ కలయికలో ‘వాల్తేరు వీరయ్య’ వచ్చింది. చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రాల్లో పలువురు యువ కథానాయకుల పేర్లు వినిపించాయి. సమ ఉజ్జీలైన కథానాయకులు కలిసి నటిస్తే ఆ హంగామా వేరుగా ఉంటుంది. అయితే మార్కెట్‌
లెక్కలు అందుకు సహకరించాల్సి ఉంటుందనేది ట్రేడ్‌ వర్గాల మాట. ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటిస్తున్నప్పుడు వారి పారితోషికాలు, ఆ సినిమాల స్థాయికి తగ్గట్టుగా మార్కెట్‌ కావాల్సి ఉంటుందని, ఆ లెక్కల దగ్గర చాలా సినిమాలు ఆగిపోతున్నాయనేది సినీ వర్గాలు చెబుతున్న సంగతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని