Pawan Kalyan: ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ ఆట మొదలైంది.. రంగంలోకి దిగిన కొత్త వ్యక్తి
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawankalyan) కొత్త సినిమా మొదలైంది. సుజిత్ (Sujeeth) దర్శకుడిగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఇది తెరకెక్కనుంది.
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) - ‘సాహో’ సుజిత్ (Sujeeth) కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే పేరుతో ఇది ప్రచారంలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, అల్లు అరవింద్, దిల్‌రాజు, రచయిత కోన వెంకట్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై నూతన టీమ్‌కు అభినందనలు తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ సరికొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎవరు పనిచేయనున్నారో తెలిసింది. తమన్ స్వరాలు అందించనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. సుజిత్‌తో దిగిన ఓ ఫొటోని తమన్ షేర్ చేస్తూ.. ‘‘మేము మొదలుపెట్టేశాం’’ అని పేర్కొన్నారు. ‘వకీల్‌సాబ్’, ‘భీమ్లానాయక్’ తర్వాత తమన్ పనిచేస్తోన్న పవన్ ప్రాజెక్ట్ ఇదే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Temples News
అంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చింది?
-
General News
Viveka murder case : వివేకా హత్య కేసులో తులసమ్మ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Ap-top-news News
Gudivada Amarnath : మంత్రి గారికి కోపమొచ్చింది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్
-
Ts-top-news News
MLC kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
-
Ap-top-news News
Vijayawada: విజయవాడ- శిర్డీ విమాన సర్వీసు ప్రారంభం