RAM: రామ్‌, బోయపాటి సినిమాలో సందడి చేయనున్న పెళ్లిసందడి భామ...!

రామ్‌, బోయపాటిల సినిమాలో రామ్‌ సరసన పెళ్లిసందడి భామ శ్రీలీల నటించనుందని తెలిపారు. అలాగే ఈ సినిమాకు తమన్‌ స్వరాలు అందిస్తున్నట్లు చెప్పారు.

Published : 06 Oct 2022 14:44 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మాస్‌ సినిమాలు అనగానే గుర్తొచ్చే దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. ఇక చూడగానే పక్కింటి అబ్బాయిలా కనిపించే యంగ్‌ హీరో రామ్‌ పోతినేని. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి దాని వివరాలేంటి అందులో ఎవరెవరు ఉంటారో అన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేశారు చిత్రబృందం. దసరా సందర్భంగా ఈ క్రేజీ కాంబోకి సంబంధించి మూడు అప్‌డేట్స్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో రామ్‌ సరసన పెళ్లిసందడి భామ శ్రీలీల నటించనుందని తెలిపారు. అలాగే ఈ సినిమాకు తమన్‌ స్వరాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ ఈ రోజు నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ ఈ విషయాలను అధికారిక ప్రకటన చేస్తూ..‘అందమైన, ప్రతిభావంతురాలైన శ్రీలీల మా ప్రాజక్టులో నటిస్తుందని చెప్పడానికి ఆనందిస్తున్నాం. సెన్సేషనల్‌ సంగీత దర్శకుడు తమన్‌ మా బృందంలో భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.’’ అని పోస్ట్‌ చేశారు. బోయపాటికి ఇది 10వ సినిమా కాగా, రామ్‌పోతినేనికి 20వ సినిమా.  ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు