Om Bheem Bush: మరో కామెడీ ఎంటర్‌టైన్‌ ‘ఓం భీమ్‌ బుష్‌..’ నటీనటులు ఎవరంటే?

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.

Published : 22 Feb 2024 13:06 IST

హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో సరికొత్త కామెడీ ఎంటర్‌టైన్‌ సిద్ధమైంది. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush) నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటీనటులతో పాటు, టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ విడుదల చేసింది. ఇందులో పల్లెటూరి నేపథ్యాన్ని చూపిస్తూ శ్రీవిష్ణు, రాహుల్‌, ప్రియదర్శి ఆస్ట్రోనాట్‌ షూట్‌లో వస్తూ కనిపించారు.  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మూవీ తీర్చిదిద్దామని, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌ ఉంటుందని చిత్ర బృందం చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని