Sreeleela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్‌ హీరోకు జోడీగా..?

గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్‌ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

Published : 22 Apr 2024 16:25 IST

హైదరాబాద్‌: ‘ధమాకా’ విజయం తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి శ్రీలీల(Sreeleela). ఈ మధ్యకాలంలో దాదాపు ఐదారు చిత్రాల్లో నటించినప్పటికీ ‘భగవంత్ కేసరి’ మినహా ఏదీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె కెరీర్‌ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టుల ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, తాజాగా ఆమెకు లక్కీ ఛాన్స్‌ వరించిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఆఫర్‌ ఏమిటంటే?

కోలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు అజిత్‌ హీరోగా ‘మార్క్‌ ఆంటోనీ’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితం కానుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రీలీలను వరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని.. కథ నచ్చడంతో అంగీకారం తెలిపిందని పేర్కొంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆమె కెరీర్‌కు ఇదెంతో ఉపయోగపడుతుందని, దీనితర్వాత కోలీవుడ్‌ చిత్రాల్లో వరుసగా యాక్ట్‌ చేయడానికి ఛాన్స్‌ దొరుకుతుందని విశ్లేషకుల అంచనా. దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని