Sreeleela: మాటరాని మౌనమిది

ఓ పక్క స్టార్‌ కథానాయకుల సినిమాల్లో నటిస్తూ.. మరో పక్క యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది కథానాయిక శ్రీలీల. ఇటీవల ‘స్కంద’ కోసం రామ్‌తో జోడీ కట్టింది.

Updated : 28 Sep 2023 14:10 IST

ఓ పక్క స్టార్‌ కథానాయకుల సినిమాల్లో నటిస్తూ.. మరో పక్క యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది కథానాయిక శ్రీలీల. ఇటీవల ‘స్కంద’ కోసం రామ్‌తో జోడీ కట్టింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా గురువారం రానుంది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో ముచ్చటించారు.

‘స్కంద’ లాంటి సినిమా చేయడం నాకిదే తొలిసారి. ఆ వాతావరణం, సెట్స్‌, చిత్రీకరణ చూసినప్పుడు చాలా ఘనంగా, కొత్తగా అనిపించాయి. ఈ సినిమా ప్రయాణం తర్వాత యాక్షన్‌ సినిమాలపైనా, దర్శకులపైనా, నటులపైనా మరింత గౌరవం పెరిగింది. కొన్నిసార్లు మనం యాక్షన్‌ సన్నివేశాలు అలా చూసి వదిలేస్తాం కానీ... అవి తీయడం ఎంత కష్టమో, వాటికోసం ఎంతగా శ్రమిస్తారో ఈ సినిమాతో మరింత బాగా అర్థమైంది. ఫైట్స్‌ని అందంగా చూపించడం, భావోద్వేగాలు పండించడం దర్శకుడు బోయపాటి శ్రీను మ్యాజిక్‌. అది మరోసారి ఈ సినిమాలో చూస్తారు. ఇందులో నాది క్లాస్‌, మాస్‌ కలిసిన పాత్ర. ఆ పాత్ర పేరేమిటనేది తెరపైనే చూడాలి.


  • రామ్‌.. నేనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నటించాం. స్టైల్‌, డ్యాన్స్‌, నటన... ఇలా చాలా విషయాల్లో కొత్తగా ప్రయత్నించాను. తనతో కలిసి నటించడం మంచి అనుభవం. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది.

  • కెరీర్‌లో ప్రస్తుతం నా పరిస్థితి గురించి చెప్పాలంటే మాట రాని మౌనం అంటారు కదా. ప్రస్తుతం నా స్థితి కూడా అదే. ఇదంతా కొత్తగా ఉంది. ఇంత ప్రేమ, ఇంత ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రస్తుతానికి నా దృష్టంతా దానిపైనే.

  • ‘‘డ్యాన్స్‌ విషయంలో అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసు. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ‘ధమాకా’లో పాటలకి అంత స్పందన వస్తుందని ఊహించలేదు. ‘ధమాకా’లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటుంది. ‘స్కంద’కి వచ్చేసరికి ప్రేమ్‌రక్షిత్‌ మాస్టర్‌ వెస్టర్న్‌ స్టైల్‌ డ్యాన్స్‌ చేయించారు. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ అవ్వడంతో అదే అలవాటు ఉండేది. ఈ సినిమాకోసం వెస్టర్న్‌ డ్యాన్స్‌పై కూడా పట్టు పెంచుకున్న’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని