Salaar: ట్రెండింగ్‌లోకి ‘సలార్‌’.. నెట్టింట వైరలవుతోన్న వార్తలు..

‘సలార్‌’ (Salaar) ట్రైలర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌ టికెట్స్‌ విషయంపై ఓ అధికారిక ప్రకటన వచ్చింది.

Updated : 31 Aug 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్ అభిమానులతో పాటు యాక్షన్‌ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్‌’ (Salaar) ఒకటి.  ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా ‘సలార్‌’కు సంబంధించిన కొన్ని వార్తలు ట్విటర్‌లో షేర్‌ అవుతున్నాయి. దీంతో ఈ హ్యాష్‌ ట్యాగ్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, చిత్రబృందం ఇప్పటి వరకూ దీని ట్రైలర్‌ను విడుదల చేయలేదు. దీంతో అభిమానులంతా సలార్‌ ట్రైలర్‌ హ్యాష్‌ట్యాగ్‌తో (#Salaartrailer) పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక సలార్‌కు సంబంధించిన మరో వార్త కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రబృందం నుంచి ఓ బిగ్‌ అప్‌డేట్‌ ఈ ఆదివారం రానుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ట్రైలర్‌ కూడా సెప్టెంబర్‌ 6వ తేదీ విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ట్రైలర్‌తో పాటు ఇందులోని పాటకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇప్పుడీ వార్తను ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. 

ప్రియాంకను చూసి భయపడ్డా.. పాకిస్థానీ నటుడి హేళన

ఇక మరోవైపు విదేశాల్లో ‘సలార్‌’ (Salaar) టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5లక్షలకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధికారికంగా తెలిపింది. దీంతో ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ స్థాయిలో ఏ సినిమా టికెట్స్ కొనుగోలు కాలేదని ఆ సంస్థ వెల్లడించింది. ఈ పోస్ట్‌తో అందరికి ‘సలార్‌’పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయని నిర్మాతలు గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ (Shruti Haasan) నటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని